తొలి టీకా నేను అందుకే తీసుకోలేదు

తొలి టీకా నేను అందుకే తీసుకోలేదు

కరోనా వ్యాక్సిన్ తానే ముందుగా తీసుకుంటానని గతంలో ప్రకటించిన మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు మొదటి వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆయనకు బదులుగా గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సఫాయి కార్మికురాలు కృష్ణమ్మకు మొదటి టీకా ఇచ్చారు. అయితే తాను మొదటి టీకా ఎందుకు తీసుకోలేదో మంత్రి ఈటల తెలిపారు.

‘ప్రాణాలకు తెగించి డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేశారు. ప్రాణ త్యాగం కూడా చేశారు. వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. అందుకే వారికి ముందుగా వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు. ప్రధాని పిలుపు మేరకే నేను వేసుకోవాల్సిన మొదటి వాక్సిన్‌ను సఫాయి కర్మచారికే ఇచ్చాం. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదు’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

For More News..

రాష్ట్రంలో తొలి టీకా వేసుకున్న సఫాయి కార్మికురాలు

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

గుండెపోటుతో పాండ్యా తండ్రి మృతి