జాతర సక్సెస్.. 100 ఎకరాలు కొనే ఆలోచనలో సర్కార్

జాతర సక్సెస్.. 100 ఎకరాలు కొనే ఆలోచనలో సర్కార్

అందరి సహకారంతో మేడారం జాతరను సక్సెస్  చేశామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్.  సమ్మక్క, సారలమ్మ దేవతలే జాతరను ముందుండి నడిపారన్నారు. రాజకీయాలకు అతీతంగా నాయకులంతా ఈ ఉత్సవానికి సహకరించారన్నారు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయనతో పాటు, మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మాట్లాడారు.  ప్రత్యేక టీమ్ లతో రోడ్ పనులు పూర్తి చేశామని చెప్పారు ఎర్రబెల్లి.  జాతరపై సీఎం ప్రత్యేక శ్రద్ద పెట్టారని, రాబోయే రోజుల్లో జాతర కోసం 100 ఎకరాలు కొనుగోలు చేస్తామన్నారు మంత్రి. మేడారం ను ఓ టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్  ఆలోచన అని,  మేడారంకు జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈ ఏడాది జాతరకు 75 కోట్లకు తోడు శాఖల వారీగా నిధులు ఖర్చు చేశామని చెప్పారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..మేడారం జాతరపై ప్రభుత్వం  ప్రత్యేక శ్రద్ద తీసుకుందని చెప్పారు.  గిరిజన బిడ్డగా జాతర నిర్వహణలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు.