కేసీఆర్ తోనే లెక్క... హరీష్ రావు, కేటీఆర్ తో మాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్ తోనే లెక్క... హరీష్ రావు, కేటీఆర్ తో మాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్ట్ వెంకట్ రెడ్డి.కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. కేసీఆర్ వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ తో తమకు సంబంధం లేదని.. వాళ్ళు లెక్కలోకి రారని.. కేసీఆర్ తోనే లెక్క అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.కేసీఆర్, తాము ఉద్యమంలో పనిచేశామని..  తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. హరీష్ రావు ఉత్తి ఎమ్మెల్యే మాత్రమే అని.. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదని అన్నారు కోమటిరెడ్డి.

ALSO READ | నాకేం తెల్వదు.. వాట్సప్ ద్వారా కేటీఆర్ ఆదేశాలిచ్చిండు..అవన్నీ నేను చూసుకుంటా అన్నడు

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పు ఒప్పులను చెప్పాలని అన్నారు. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తామని.. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటామని అన్నారు. కేసీఆర్ తోనే తమకు లెక్క అని.. హరీష్ రావు ఎవరో నాకు తెలీదని అన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యపై ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రేయార్టీ బేస్ పై హ్యమ్ మోడల్ లో రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సీఎంతో చర్చ జరిపి ఈ నెలాఖరు వరకు 15 ప్యాకేజీలు వరకు సెప్టెంబర్ లో పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు కోమటిరెడ్డి.

దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్ రోడ్లు వేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6వేల 500 కోట్ల రూపాయలను రోడ్ల కోసం విడుదల చేశామని అన్నారు. రూ. 15వందల కోట్లతో అప్రోచ్ రోడ్లు లేకుండా గ్రామాలకు లింక్ బ్రిడ్జ్ లు గత ప్రభుత్వం కట్టిందని అన్నారు కోమటిరెడ్డి. రూ. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సింగిల్ రోడ్లను పునరుద్ధరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి. 

వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ రోడ్లు, హ్యమ్ రోడ్లను పూర్తి చేసి..దేశానికి ఆదర్శంగా నిలుస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్యలో ప్రపంచంలోనే ఇండియా మొదటిదని.. దేశంలో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయని అన్నారు. విజయవాడ రూట్ లో ఆక్సిడెంట్ బ్లాక్ స్పాట్ ను గుర్తించామని..  పనులు నడుస్తున్నాయని అన్నారు. కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ. 3400 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్ళిపోయారని.. గడిచిన ఐదేళ్లుగా ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదని అన్నారు కోమటిరెడ్డి. 

ట్రిపుల్ ఆర్ పై నితిక్ గడ్కారీ, ప్రధాన మంత్రి ని కలుస్తానని.. ట్రిపుల్ ఆర్ కోసం 96 శాతం ల్యాండ్ అక్విజిషన్ చేశామని.. కొత్త టెండర్లు పిలుస్తామని అన్నారు కొమటిరెడ్డి. సదరన్ పార్ట్ ట్రిపుల్ ఆర్ ప్రాసెస్ త్వరలోనే మొదలు పెడతామని.. రీజినల్ రింగ్ రోడ్డు ను మూడేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. 40:60 శాతం ప్రకారం హ్యమ్ రోడ్లు NHA మోడల్ లో అందుబాటులోకి రాబోతున్నాయని.. హ్యమ్ రోడ్లలో టోల్ అనే ప్రసక్తే లేదని..  కేవలం రెండు రూట్ లలో మాత్రమే టోల్ ప్రఫోజల్ ఉందని అన్నారు కోమటిరెడ్డి.