
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగాల తొలగింపునకు తెరతీసింది. 2025లో నెలల వ్యవధిలోనే రెండోసారి ఉద్యోగులు తొలగింపునకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. వందల్లో కాదు వేలల్లో ఉద్యోగులను ఇంటికి పంపించేయాలని మైక్రోసాఫ్ట్ సంస్థ డిసైడ్ అయింది. 9 వేల మందికి పైగా ఉద్యోగాలకు మైక్రోసాఫ్ట్ మంగళం పాడనుంది. ముఖ్యంగా ‘Xbox’తో పాటు మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి.
మైక్రోసాఫ్ట్ సంస్థ తన వర్క్ ఫోర్స్లో 4 శాతం ఉద్యోగాలకు కోత పెట్టాలని డిసైడ్ అయిందని.. అంటే సుమారు 9100 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగాల నుంచి తొలగించనుందని Seattle Times బుధవారం తెలిపింది. జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 28 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2025 మే నెలలో మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావంతో 6 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
►ALSO READ | UPI Alert: HDFC కస్టమర్లకు అలర్ట్.. ఆ 2 రోజులు యూపీఐ సేవలు పనిచేయవ్..
జూన్ నెలారంభంలో కూడా 305 మంది ఉద్యోగాలు పోయాయి. ఇలా.. ఏడాది కాలంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది. అయితే.. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నప్పటికీ ఉద్యోగాలు కోల్పోయిన వారికి మైక్రోసాఫ్ట్ కాస్తోకూస్తో చేస్తున్న మంచి పనేంటంటే.. ఇతర సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేసుకునేందుకు సాయపడుతుంది. ఇటీవల గేమింగ్ ఇండస్ట్రీ కుదుపులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు పలు గేమింగ్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టాయి. మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటను ఎంచుకుంది.
*MICROSOFT TO CUT 9,000 WORKERS IN SECOND WAVE OF MAJOR LAYOFFS
— Spencer Hakimian (@SpencerHakimian) July 2, 2025
We are in a recession.