
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా ఉన్న భోలే బాబా డైరీ డైరెక్టర్లు వైష్ణవి డైరీ సీఈఓ సహా పలువురికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశంలో సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న క్రమంలో గురువారం ( జులై 3 ) ఈ కేసులో A3 గా ఉన్న పోమిల్ జైన్, A4 గా ఉన్న విపిన్ జైన్, A5 గా ఉన్న వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడా లకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
ALSO READ | తిరుమలలో మామూళ్ల రచ్చ.. షాపు యజమానిపై విజిలెన్స్ సిబ్బంది దాడి..
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో గురువారం విచారణ జరిపిన కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.కేసు దర్యాప్తుకు సహకరించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2025 ఫిబ్రవరి 9న నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది సిట్ బృందం.ఉత్పత్తి సామర్ధ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు పలు ఉత్తరాది డైయిరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు గుర్తించిన సీబీఐ.. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైయిరీకి సంబంధించిన విపిన్ గుప్త, పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుంది.
ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్ జూన్ 26న నివేదికను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేసు దర్యాప్తు తేలిన అంశాలను పొందు పరిచిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. దీంతో పాటు నిందితుల పిటిషన్ల పురోగతిని కూడా నివేదికలో వివరించినట్లు తెలిపింది సిట్. సిట్ సమర్పించిన నివేదికపై త్వరలో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు.