బంగారం అమ్మకాలకు.. కొత్త ఫ్లాట్ఫాం

బంగారం అమ్మకాలకు.. కొత్త ఫ్లాట్ఫాం
  • నిహార్ ఇన్ఫో గ్లోబల్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: బంగారం, వెండి అమ్మకం కోసం goldnsilver.shop పేరుతో ప్లాట్‌ఫామ్​ను తీసుకువస్తున్నట్టు హైదరాబాద్​ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ ప్రకటించింది. దీని ద్వారా కస్టమర్లు డిజిటల్, ఫిజికల్ గోల్డ్ కొనొచ్చు. సేఫ్ గోల్డ్, జెరోధా, క్యాష్ ఫ్రీ సాయంతో ఈ సేవలు అందిస్తారు. 

మూడో క్వార్టర్లో కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. కన్సాలిడేటెడ్ టర్నోవర్ రూ.9.01 కోట్లకు చేరింది. గత క్వార్టర్ లో ఇది రూ.5.92 కోట్లు ఉంది. స్టాండెలోన్ టర్నోవర్ రూ.5.88 కోట్లుగా నమోదైంది.  నికర లాభం రూ. 30 లక్షలు వచ్చింది. 

2026 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం ఆదాయం రూ.18.06 కోట్లకు చేరగా, నికర లాభం రూ.68 లక్షలు ఉంది. స్టాండలోన్ ఆదాయం రూ.5.89 కోట్లుగా ఉంది.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో రైట్స్ ఇష్యూ ప్రతిపాదనను బోర్డు వెనక్కి తీసుకుంది. నాన్ కోర్ బిజినెస్​ల​  నుంచి వైదొలుగుతూ ఈ–కామర్స్​పై దృష్టి పెడతామని నిహార్ ఇన్ఫో తెలిపింది .