తిరుమలలో మామూళ్ల రచ్చ.. షాపు యజమానిపై విజిలెన్స్ సిబ్బంది దాడి..

తిరుమలలో మామూళ్ల రచ్చ..  షాపు యజమానిపై విజిలెన్స్ సిబ్బంది దాడి..

కలియుగ వైకుంఠం తిరుమలలో మామూళ్ల వసూళ్లు రచ్చకు దారి తీశాయి.విజిలెన్స్ సిబ్బందికి స్టూడియో యజమానికి మధ్య మామూళ్ల విషయంలో తలెత్తిన వివాదం పిడిగుద్దులు గుద్దుకునే స్థాయికి వెళ్ళింది. బుధవారం ( జులై 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఆలయ ఆస్థాన మండపం దగ్గర ఉన్న స్టూడియో దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. మామూళ్ల వసూలు విషయంలో విజిలెన్స్ సిబ్బందికి స్టూడియో యజమానికి మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీసిందని ఇతర దుకాణదారులు చెబుతున్నారు.

వివాదం తారాస్థాయికి చేరడంతో విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, స్టూడియో యజమాని పిడిగుద్దులు గుద్దుకున్నారని తెలిపారు దుకాణదారులు. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అధికారుల ఆదేశాలతో ఘటనపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 

►ALSO READ | IPS పదవికి సిద్దార్థ్ కౌశల్ రాజీనామా.. ఎందుకంటే..?

తిరుమల కొండ మీద వ్యాపారం చేసుకొని బతికే తమపై కొంతమంది సిబ్బంది మామూళ్ల పేరుతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని.. వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు దుకాణదారులు. ఈ ఘటనతో విజిలెన్స్ సిబ్బంది మామూళ్ల వసూలుకు అధికారులు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి.