కోటి 10 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నం

కోటి 10 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నం

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం మండలం చెల్పూరులో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా పండుగ కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ  పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మొత్తం కోటి 10 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్లు, అందుకోసం 339.73 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.