చెట్టెక్కి ..తాటి కల్లు తాగిన ఎర్రబెల్లి.. .

చెట్టెక్కి ..తాటి కల్లు తాగిన ఎర్రబెల్లి.. .

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గౌడన్నగా మారాడు. తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును  తాగి..వావ్ సూపర్ అంటూ కితాబిచ్చారు. 

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గ్రామంలో  గిరక తాటి చెట్టు నుంచి కల్లు వస్తుండటం గమనించారు. ఇంకేముంది కల్లుగీయాలన్న తీయాలన్న  మంత్రి మంత్రి ఎర్రబెల్లిలో పుట్టింది. అనుకున్నదే తడువుగా నిచ్చెనతో గిరక తాటి చెట్టు ఎక్కారు. కల్లుకు కట్టిన లొట్టిని కిందకు దించారు. ఆ తర్వాత గ్లాసులో పోసుకుని లొట్టలేసుకుంటూ కల్లు తాగారు. 

పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో మూడేళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  గిరక తాటి మొక్కలను పంపిణీ చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేసిన గిరక తాటి మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి..కల్లు అందిస్తోంది. దీన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పంపిణీ చేసిన  గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి.., ఆ కల్లును త్రాగారు.

తాటి చెట్ల కంటే గిరక తాటి చెట్లు చిన్నవిగా ఉంటాయి. వంద అడుగుల తాటి చెట్లు ఎక్కడం కంటే 10 నుంచి 20 అడుగుల ఎత్తున్న గిరక తాటి చెట్లు ఎక్కడం ఈజీ అందుకే తెలంగాణ ప్రభుత్వం గతంలో గౌడసోదరులకు గిరకతాటి చెట్లను పంపిణీ చేసింది. సాధారణ తాటి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండి పంట పెట్టిన 14 సంవత్సరాలకు గాని గీతకు రాదు. కానీ బీహార్ రాష్ట్రానికి చెందిన గిరక తాటి చెట్లు 20 అడుగుల ఎత్తులో ఉండి కేవలం ఐదేళ్లకే గీతకు వస్తాయి. అలాగే 100 తాటికాయలు వరకు దిగుబడినిస్తాయి. సీజన్ లో అయితే  రోజుకు 3 నుంచి 10 లీటర్ల కల్లును అందిస్తోంది.