మహిళా అధికారినిపై నోరుజారిన ఎర్రబెల్లి..

మహిళా అధికారినిపై నోరుజారిన ఎర్రబెల్లి..

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పల్లె ప్రగతి గ్రామ సభలో.. మహిళా ఎంపీడీవోపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీడీవో నుద్దేశించి .. నీవైతే బాగానే ఊపుతున్నావ్.. కానీ ఇక్కడ ఊపడం లేదని.. మంత్రి అన్నారు. దీంతో.. అక్కడ హాజరైన అందరూ నవ్వుకున్నారు. కానీ.. ఆ కామెంట్స్ తో మహిళా ఎంపీడీఓ ఇబ్బందిపడ్డారని అక్కడున్నవాళ్లు అంటున్నారు.