సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సాగు నీరు సమృద్ధిగా లభిస్తుందన్నారు. బ్యాంక్ ద్వారా రైతులకు నేరుగా సేవ చేసే అవకాశం ఉందన్నారు.ఆంధ్రా డీసీసీబీ బ్యాంకుల కన్నా తెలంగాణలో బ్యాంకులు మెరుగ్గా పని చేస్తున్నాయని చెప్పారు. గతంలో ఎప్పుడు వరంగల్ డీసీసీబీ బ్యాంక్ కు ఒక్క అవార్డు కూడా రాలేదన్నారు.
రైతులకు సేవ చేయడానికి డీసీసీబీ పాలవర్గానికి మంచి అవకాశం లభించిందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. డీసీసీబీ చైర్మన్లు, డైరెక్టర్లకు ప్రోటోకాల్ కల్పించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దివాళా తీసే డీసీసీబీ బ్యాంక్ ను లాభాల బాటలో పయనిస్తుందన్నారు.
సహకార సంఘాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. చిరు వ్యాపారులకు లోన్లు ఇచ్చి వారి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. హనుమకొండలోని డీసీసీబీ కార్యాలయంలో 2023 క్యాలెండర్, డైరీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, డైరెక్టర్లు ఆవిష్కరించారు.