కేసీఆర్ సీఎం అయ్యాకే రామప్పకు యునెస్కో గుర్తింపు: ఎర్రబెల్లి

కేసీఆర్ సీఎం అయ్యాకే  రామప్పకు యునెస్కో గుర్తింపు: ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 50 ఏండ్లకిందే రామప్పకు యునెస్కో గుర్తింపు రావాల్సి ఉండే కానీ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ  గుర్తింపు వచ్చిందన్నారు. తన వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని..అసలు యునెస్కో  ప్రయత్నం చేసే సమయంలో కిషన్ రెడ్డి టూరిజం మినిస్టరే కాదన్నారు. కేంద్రం అయోధ్య తప్పితే ఏ గుడిని అభివృద్ధి చేయలేదన్నారు. మహారాష్ట్ర వంటి పెద్ద పెద్ద సిటీల్లో కూడా దుమ్ము, ధూళితో ఉన్నాయని.. చాలా రాష్ట్రా్ల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు ఎర్రబెల్లి.

 కేసీఆర్ వల్ల రాష్ట్రంలో ఆలయాలు, గుళ్లు, కవులు, కళాకారులకు గుర్తింపు వచ్చిందన్నారు ఎర్రబెల్లి.  రాష్ట్రంలో అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు సీఎం కేసీఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.  తెలంగాణను ఆగం చేసేందుకు కొన్ని శక్తులు మతం పేరుతో కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.  దేశంలో అత్యధిక జీతాలు ఇస్తుంది తెలంగాణలోనేనని... ఉద్యోగుల కోసం కేసీఆర్ ఎంతో  ప్రయత్నం చేశారని కొనియాడారు.