వీ6 చానెల్ డిబేట్‌పై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

వీ6 చానెల్ డిబేట్‌పై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో సర్పంచ్‌లకు విడుదల చేయవలసిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని శనివారం ఉదయం వీ6 చానెల్‌లో జరిగిన డిబేట్‌పై మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. సర్పంచ్‌లకు విడుదల చేయవలసిన డబ్బులు పెండింగ్‌లో లేవని ఆయన తెలిపారు. ఒకవేళ అటువంటివి ఏమైనా ఉంటే వెంటనే నిధులు విడుదల చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్ల మేరకు రాష్ట్రానికి నిధులు రావలసి ఉందని ఆయన అన్నారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులందరూ ఈ నెల 17వ తేది పొద్దున 10 నుండి 11 గంటల సమయంలో కోటి మొక్కలు నాటాలని ఆయన సూచించారు. అటవీ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4 శాతం అడవులు పెరిగాయని ఆయన తెలపారు. ఇక తెలంగాణలో షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ గురించి ఆయన స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీలను దగ్గరకి రానియ్యారని ఆయన అన్నారు. తెలంగాణ వాళ్ళు పెట్టిన పార్టీలే సక్సెస్ కాలేదని.. అటువంటప్పుడు ఆంధ్ర వాళ్లు పెట్టిన పార్టీలు ఎందుకు సక్సెస్ అవుతాయని ఆయన అన్నారు.

మిషన్ భగీరథ నీళ్లు తమ ఊర్లో రావడం లేదని జానారెడ్డి అనడం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు. ‘వాళ్ళ గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నాం. మిషన్ భగీరథ నీళ్లు జానా రెడ్డి కూడా తాగారు. నేషనల్ హైవే పనులు జరగడం వలన రెండు రోజులు నీళ్లు రాలేదు. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ జానారెడ్డికి పంపిస్తున్న. రాజకీయ లబ్దికోసమే జానారెడ్డి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆ వ్యాఖ్యలు చేసినట్టు ఉంది. ఇద్దరు ఆఫీసర్లు వాళ్ళ ఇంటికి వెళ్లి.. ఆ రెండు రోజులు నీళ్లు ఎందుకు రాలేదో చెప్తారు. జానారెడ్డికి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే ఆ విధంగా మాట్లాడారు. రాష్ట్రం మొత్తం మీద 90 రిమోట్ గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తాం’ అని ఆయన అన్నారు.

For More News..

వాహనదారులపై పెట్రో బాంబ్.. లీటర్ ధర 92కు చేరువ

ఇల్లు కట్టుకోవడానికి సరైన​ టైమ్​ ఇదే!

సిటీలో డబుల్​ డెక్కర్​కు రూట్​ క్లియర్.. బస్సులు తిరిగే రూట్లు ఇవే!