ప్రభుత్వంపై బురద జల్లుడు మానుకోండి : మంత్రి ఈటల

ప్రభుత్వంపై బురద జల్లుడు మానుకోండి :  మంత్రి ఈటల

కరోనా వైరస్ ట్రీట్ మెంట్ విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి ఈటల రాజేందర్ . గచ్చిబౌలీ టిమ్స్ ను పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల..ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నివేల కోట్లైనా ఖర్చుపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.  టిమ్స్ లో మొత్తం 13 ఫోర్లలో  1224  బెడ్స్ వేయగలిగే సామర్ధ్యం ,1000 బెడ్స్ కు ఆక్సిజన్ సౌకర్యం ,50 వెంటి లేటర్ బెడ్స్, క్యాంటీన్ సౌకర్యం ఉందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో స్టాఫ్ రిక్రూట్ చేసి త్వరలోనే ట్రీట్ మెంట్ సౌకర్యాన్ని ప్రారంభిస్తామన్నారు.

ప్రభుత్వం పై బురదజల్లుతున్నారు

కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం మీద బురద చల్లే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాందీ ఆస్పత్రి ట్రీట్ మెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారాల్ని నమ్మొద్దన్నారు. పేదలను కాపాడే విధంగా గాంధీ వైద్యులు పని చేస్తున్నారని, కుటుంబ సభ్యులు లేకపోయినా శానిటేషన్ వర్కర్స్, వైద్యులు అన్నీ పనులు వాళ్లే చేస్తున్నారని కొనియాడారు.  కరోనా పేషెంట్లు ట్రీట్ మెంట్ చేయడం చాలకష్టమని  ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చెబుతుంటే..గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రాణాల్ని ఫణంగా పెట్టి ట్రీట్ మెంట్ అందిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.