కింగ్ నాగార్జున 100వ చిత్రం.. క్లాప్ కొట్టనున్న మెగాస్టార్!

 కింగ్ నాగార్జున 100వ చిత్రం..  క్లాప్ కొట్టనున్న మెగాస్టార్!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున దాదాపు నాలుగు దశాబ్దాలుగా యాక్షన్,  స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటూ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.  66 ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ యువకుడిలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇటీవల రజనీకాంత్ 'కూలీ' చిత్రంలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇప్పుడు అందరి చూపు ఆయన 100 వ చిత్రంపైనే. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.  నాగార్జున 100వ చిత్ర పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది. చిరు, నాగ్ మంచి మిత్రులు కూడా. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ నెలాఖరులో జరగవచ్చని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నాగార్జున తన 100 వ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నారని సినీ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రానికి యువ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తారని నాగార్జున ఇటీవల ప్రకటించారు. ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా ప్రకటన వాస్తవానికి నాగార్జున పుట్టినరోజున (ఆగస్ట్ 29) రావాల్సి ఉంది. కానీ, అప్పుడు 'కూలీ' (Coolie) చిత్రం థియేటర్లలో నడుస్తోంది. అందులో నాగార్జున విలన్ పాత్రలో నటించారు. ఆ సినిమా మీద దృష్టి మరల్చడం ఇష్టం లేక, ఇప్పుడు తన 100 చిత్రానికి సిద్ధమయ్యారు.

ALSO READ : ‘ఓజీ’ట్రైలర్ వచ్చేస్తోంది.. పవర్ తుఫానుకి సిద్ధంగా ఉండండి
 
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైంది. ప్రస్తుతం నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ షూటింగ్ చేస్తూనే, తన 100వ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటారు. నాగార్జున తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలామంది నాగార్జున ఒక అనుభవం ఉన్న దర్శకుడితో కలిసి పనిచేస్తారని ఊహించారు. కానీ, ఆయన రా కార్తీక్‌ని ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చారు కింగ్. ఈ సినిమా అధికారక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.