
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘OG’ (ఓజస్ గంభీర). యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 25న) ‘ఓజీ’ వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే, మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసి, వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘ఓజీ’ ట్రైలర్ ఆదివారం (సెప్టెంబర్ 21న) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘డెత్ కోటా.. కన్ఫర్మ్ అంటా!! సెప్టెంబర్ 21న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG ట్రైలర్ రానుంది. పవర్ తుఫానుకి సిద్ధంగా ఉండండి’’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Death quota….confirm anta!! 🤙🏻🤙🏻
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025
The most awaited #OGTrailer on Sep 21st.#OG #TheyCallHimOG pic.twitter.com/lmAo1CkdAU
మరోవైపు ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్తో విదేశాల్లో అదరగొడుతోంది. ఉత్తర అమెరికాలో 60K టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద 1.6 మిలియన్ డాలర్లను రాబట్టి సంచలనాలు సృష్టిస్తోంది.
Washi o Washi #OG 🔥🔥🔥#TheyCallHimOG North America Premieres Pre Sales $1.6M+ and counting. 💥💥💥💥https://t.co/K4uTL4mf1Y 🎫 pic.twitter.com/9R4FTwQcB8
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 16, 2025
ఇక ఏపీలో ‘ఓజీ’కి టికెట్ ధరలు పెరిగాయి. అక్కడ బెనిఫిట్ షో టికెట్ ధర ఏకంగా రూ.1,000లు (జీఎస్టీతో కలిపి) ఉంది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.125 (GSTతో కలిపి) సవరించిన ధర రూ. 272.5/- అవుతుంది. మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (GSTతో కలిపి), సవరించిన ఛార్జీ రూ. 327/-గా ఉంది.
ఇదిలా ఉంటే.. ‘ఓజీ’లో ఓజాస్ గంభీర అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్ నటించాడు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.