PGIMERలో ఉద్యోగావకాశం.. ఎగ్జామ్ లేదు.. పిజి చేసిన వాళ్ళు అప్లయ్ చేసుకోవచ్చు..

PGIMERలో ఉద్యోగావకాశం.. ఎగ్జామ్ లేదు.. పిజి చేసిన వాళ్ళు అప్లయ్ చేసుకోవచ్చు..

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 26. 

పోస్టులు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ --I.

ఎలిజిబిలిటీ: కనీసం 60 శాతం మార్కులతో లైఫ్ సెన్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్​తోపాటు లైఫ్​సైన్సెస్​లో పీహెచ్​డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 13. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  pgimer.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.