
శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2025 కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. సమాజంలో ఫోటోగ్రాఫర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని, పాలిటిక్స్, పెళ్లిళ్లు, ఈవెంట్స్ అన్నీ కెమెరామెన్, వీడియోగ్రాఫర్ లేకుండా జరగవని గుర్తు చేశారు.మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.
కోవిడ్ సమయంలో 143 కుటుంబాలను ఆదుకున్న అసోసియేషన్ బాధ్యతాయుతమైన పనిన చేసిందని అభినందించారు మంత్రి వివేక్. ఫోటోగ్రాఫర్స్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందేందుకు అసోసియేషన్ కృషి చేస్తున్న విధానాన్ని ప్రశంసించిన మంత్రి వివేక్.. కెమెరాలు,
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవనం, ఐడెంటిటీ కార్డులపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్స్‌కు ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్లడించారు.
ALSO READ : కేసీఆర్.. మీరు చేస్తే సంసారం..
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.కాకా గారు స్థాపించిన అంబేద్కర్ విద్యా సంస్థలు ద్వారా 50 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని అన్నారు. 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు మాఫీ స్కీమ్ కొనసాగుతోందని తెలిపారు మంత్రి వివేక్.
గత సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ఆరు రాష్ట్ర ర్యాంకులు సాధించామని అన్నారు. పెద్దపల్లిలో ఫోటోగ్రాఫర్స్ కోసం ఎంపీ లాడ్స్ ఫండ్ ద్వారా రూ. 10–15 లక్షల నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్.ఫోటోగ్రాఫర్స్ ఐక్యతగా ఉంటేనే బలంగా నిలబడగలరని సూచించారు.