కేసీఆర్ నీపై నీ మంత్రే తిరుగుబాటు చేస్తున్నారు

కేసీఆర్ నీపై నీ మంత్రే తిరుగుబాటు చేస్తున్నారు

రైతు వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మొన్నటి వరకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తన మంత్రులు, ఎమ్మెల్యేలతో నిరసన తెలిపిన కేసీఆర్.. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకుని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. మోడీ కాళ్ల దగ్గర రైతులను తాకట్టు పెట్టి మోడీతో…కేసీఆర్ అలాయ్ బలాయ్ చేస్తురన్నారు. మరోవైపు.. ఐకెపి సెంటర్లను ఎత్తివేయడం సాధ్యమయ్యే పని కాదంటూ మంత్రి ఈటల రాజేందర్ … నీ పైనే తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు.. ఒకవేళ ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను ఎత్తివేస్తే ఈ ప్రభుత్వం తన ఉనికి కోల్పోతుందని ఈటల హెచ్చరించారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు సంఘీభావంగా జగిత్యాల్లో జరిగిన నిరసనలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను ఆపుతామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే రాబోయే ఎన్నికల వరకు వ్యవసాయ చట్టాలను ఆపాలని తాము కోరుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇదే అంశంపై ఎన్నికల్లోకి వెళదామన్నారు. అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రామ రాజ్యమంటారు.. కానీ రామ రాజ్యంలో రైతులకు నైతిక విలువలు లేవా అని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర కలిపించేలా ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.