ప్రపంచంలోని 50 బెస్ట్ టిఫిన్స్‎లో 3 భారతీయ వంటకాలకు చోటు.. అవేంటంటే..?

ప్రపంచంలోని 50 బెస్ట్ టిఫిన్స్‎లో 3 భారతీయ వంటకాలకు చోటు.. అవేంటంటే..?

వివిధ రకాల వంటకాలకు భారత్ ఫేమస్. టిఫిన్స్, స్వీట్లు, బిర్యానీ ఇలా ఎన్నో వందల రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో స్పెషల్ ఐటెమ్. ఉత్తరం నుండి దక్షిణం వరకు.. తూర్పు నుండి పడమర వరకు ప్రతి ప్రాంతం దాని స్వంత ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ, ముంబై వడపావ్, చెన్నై  ఇడ్లీ సాంబార్ చెప్పుకుంటూ పోతే ఇలా చాలా రకాలే ఉన్నాయి. 

ఈ క్రమంలో ప్రముఖ ఆహార, ప్రయాణ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 50 బ్రేక్‌ఫాస్ట్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకంగా భారత్‎కు చెందిన మూడు రకాల టిఫిన్స్ చోటు దక్కించుకున్నాయి. మిసల్ 18, పరాఠా -23, చోలే భాతురే 32వ ర్యాంక్ సాధించాయి. ప్రపంచంలోనే బెస్ట్‎గా నిలిచిన ఈ బ్రేక్ ఫాస్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

 మిసల్ పావ్

ఈ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మహారాష్ట్రలో ఫేమస్. మిసల్ అంటే మిశ్రమం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే దీనిని వివిధ రకాల పదార్ధాలతో తయారు చేస్తారు. పెరుగు, మాత్ బీన్ లేదా బఠానీ కర్రీ, గ్రేవీ, మసాలా బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమోటాలు వంటి వాటితో తయారు చేస్తారు. టేస్ట్ అట్లాస్ వెబ్‌సైట్ ప్రకారంఈ వంటకం యొక్క మొట్టమొదటి ప్రస్తావన 20వ శతాబ్దం ప్రారంభంలో కనిపించింది.

పరోఠా

పరోఠా భారతీయులు ఎక్కువగా ఇష్టపడి తినే అల్ఫహారం. దీనిని  గోధుమ పిండితో తయారీ చేస్తారు. గుండ్రంగా, త్రిభుజాకారంగా, చతురస్రాకారం, హెప్టాగోనల్ ఆకారాలలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేస్తారు. పరోఠాలను ఉడికించిన బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, పనీర్ లేదా ముల్లంగి వంటి పదార్థాలతో కలుపుకుని తింటారు. కొన్ని ప్రాంతాల్లో నాన్ వెజ్‎తో కూడా పరాఠా ఆరగిస్తారు. 

 చోలే భటురే

చోలే భటురే ఢిల్లీ ప్రజల ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. చోలే భటురే రెండు వంటకాల కలయిక. చోలే బటూరే అంటే శనగపప్పు కూర (చోలే). భటురే అంటే- మైదా పిండితో తయారు చేసిన బ్రెడ్. చోలేను శనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, జిరా, కారం, పసుపు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇది ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన వంటకం. ఉత్తర భారతదేశంలోని చాలా వీధి బండ్లలో చోలే భటురే దొరుకుతుంది. ఇంట్లో కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్