మాస్క్ లపై వసూళ్లకు పాల్పడితే కేసులు పెడతాం

మాస్క్ లపై వసూళ్లకు పాల్పడితే కేసులు పెడతాం

కరోనా వైరస్ పట్ల అసత్య ప్రచారం చేసినా, మాస్క్ లపై వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి  హర్షవర్దన్‌ అన్నీ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ పై మాట్లాడిన ఈటల..కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి హర్షన్ వర్ధన్ మెచ్చుకున్నట్లు చెప్పారు.

కరోనా వైరస్ పట్ల భయాందోళనకు గురవుతున్న ప్రజలు నిరభ్యంతరంగా మార్కెెట్లకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లొచ్చని అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని..అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనారోగ్యంతో అనుమానం గా ఉన్నవారికి టెస్ట్ ల కోసం గాంధీకి ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు.

వైరస్ పేరుతో మాస్కుల్ని అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణలో వైరాలజీ ల్యాబ్ తో పాటు, ఎయిర్ పోర్ట్ లకు వచ్చే స్వదేశీ , విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.