పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌తో మంత్రి వివేక్ భేటీ.. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మంత్రికి ఘన స్వాగతం

పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌తో మంత్రి వివేక్ భేటీ.. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మంత్రికి ఘన స్వాగతం

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​తో మంత్రి వివేక్​ వెంకటస్వామి సమావేశమయ్యారు. గనులు, కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యాక శుక్రవారం మొదటిసారి గాంధీభవన్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆయనకు పలువురు పార్టీ నేతలు,  కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ను పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ చాంబర్ వద్దకు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌‌‌‌‌కు మహేశ్ గౌడ్ శాలువా కప్పి, బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. వివేక్ కూడా మహేశ్‌‌‌‌‌‌‌‌కు బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు.

అనంతరం ఇరువురు నేతలు సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించుకున్నట్టు తెలిసింది. ఇటు పార్టీలోనూ, అటు  ప్రభుత్వంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపీట వేస్తున్న విషయమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలో లోకల్​బాడీ ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం ఏడాదిన్నరగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివేక్‌‌‌‌ను మహేశ్ గౌడ్ కోరినట్టు తెలిసింది.  తాము ఇప్పటికే ఇదే పనిలో తలమునకలయ్యామని, స్థానిక ఎన్నికల్లో క్లీన్​ స్వీప్​చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి చెప్పినట్టు సమాచారం.