తెలంగాణ చరిత్ర ప్రతిబించేలా ఐ ల్యాండ్స్ ఏర్పాటు

తెలంగాణ చరిత్ర ప్రతిబించేలా ఐ ల్యాండ్స్ ఏర్పాటు

కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రి గంగుల కమలాకర్  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్‌లో మానేరు రివర్ ఫ్రంట్ కు శంకు స్థాపనతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కానున్నాయని తెలిపారు. రేపు మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తున్నారన్నారు. తెలంగాణ రాక ముందు తాను ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరీంనగర్‌లో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నారన్నారు.

నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. రేపు కరీంనగర్ లో కేటీఆర్ చేతుల మీదుగా 615 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ  చరిత్ర ప్రతిబించేలా  ఐ ల్యాండ్స్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ తో కరీంనగర్ గొప్ప టూరిజం స్పాట్ గా మారుతుందన్నారు మంత్రి గంగుల. రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 18 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. మెడికల్ కాలేజ్  కోసం రెండు చోట్లా స్థలాలు చూసామన్నారు మంత్రి గంగుల. 

ఇవి కూడా చదవండి:

రైతులపై లాఠీచార్జ్ చేయడం దారుణం