అది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష

అది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష

బండి సంజయ్ చేసేది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతంలో వడ్లు కొంటామని మాట తప్పినట్లుగా..మీరు ముందస్తు ఎన్నికలకు వస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. మీ మాటలు నమ్మే స్థితిలో లేమని..దమ్ముంటే మోడీతో ముందస్తు ఎన్నికల ప్రకటన చేయించాలన్నారు. మోడీ డేట్ ప్రకటిస్తే..ముందస్తుకు సిద్దమని సీఎం కేసీఆర్ కూడా చెప్పారని గంగుల తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చేలా బండి సంజయ్ కు ఆ దేవుడు శక్తినివ్వాలని ఆకాంక్షించారు. ధరణితో 98 శాతం భూ సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పారు. 

త్వరలో జరిగే రెవెన్యూ సదస్సులో కొద్దిపాటి సమస్యలు కూడా 100శాతం పరిష్కారమవుతాయని మంత్రి గంగుల తెలిపారు. అందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తానన్న మోడీ కోసం ప్రతీ ఏటీఎం దగ్గర కుర్చీలు వేద్దామని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పన, గ్యాస్ ధర పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఎల్ఐసీ ప్రైవేటీకరణ వంటి వాటిపై మౌనదీక్ష చేద్దామని బండికి సవాల్ విసిరారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ బీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం డిమాండ్ చేయాలన్నారు. బీసీల్లో కులగణన ఎందుకు చేయడం లేదన్న మంత్రి..చట్టాలు చేసే అధికారం ఉన్నా ఎందుకు చేయడం లేదన్నారు.