
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 55 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి హరీశ్ ప్రకటించారు. యాక్సిడెంట్లు, ఇతర ఎమర్జెన్సీ ఘటనల్లో పేషెంట్లకు వేగంగా ట్రీట్‌మెంట్ అందించి, ప్రాణాలు నిలిపేలా ఇవి సేవలందిస్తాయని పేర్కొన్నారు. మూడు స్థాయిల్లో ఆరు రకాల వైద్య సేవలను అందించేలా ట్రామా కేర్ సెంటర్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. ట్రామా, హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ తదితర ఎమర్జెన్సీ కండిషన్లకు చికిత్స అందించేందుకు డాక్టర్లు రెడీగా ఉంటారని ప్రకటనలో పేర్కొన్నారు.