రైతులను కొడుతూ.. కార్పొరేటర్లకు పంచుతున్నరు

రైతులను కొడుతూ.. కార్పొరేటర్లకు పంచుతున్నరు

రైతులను కొట్టు.. కార్పొరేట్ కు పెట్టు అన్నట్టుగా కేంద్రం తీరు తయారైందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పటాన్‌చెరు నూతన  మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు.కొత్తగా  నూకల ఎగుమతి పై నిషేధం విధించడం సరికాదన్నారు. కేంద్ర నిర్ణయాలతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు రైతులకు శాపంగా మారిందని తెలిపారు.  

ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా...  కేంద్రం మాట వినలేదన్నారు. వరి విషయంలో అవగాహన లేకుండా కేంద్రం వ్యవహరిస్తోందని హరీష్ తెలిపారు. దేశం మొత్తం ఇప్పుడు  తెలంగాణ వైపు చూస్తోందని... తెలంగాణ ధాన్యాగారంగా మారిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆకుపచ్చగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే....ప్రస్తుతం తెలంగాణలో 65 లక్షల  ఎకరాల్లో వరి సాగు అవుతుందని మంత్రి వెల్లడించారు.