వేరే పార్టీ వారిని గెలిపిస్తే పనులు జరగవు

వేరే పార్టీ వారిని గెలిపిస్తే పనులు జరగవు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేముందు ప్రజలు ఆలోచుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. కాళ్లు మొక్కితే,  ప్రలోభాలకు లొంగి ఓటు వేయొద్దని..TRS అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ వారిని గెలిపిస్తే పనులు కావన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నకల జరగనున్న క్రమంలో సంగారెడ్డి జిల్లా లోని తెల్లాపూర్ లో పర్యటించారు హరీష్. ఈ సందర్భంగా మాట్లాడారు.

గాడిదకు గడ్డివేసి.. బర్రెకు పాలు పితికితే వస్తాయా అని ప్రశ్నించారు. తెల్లాపూర్ లో మంచి పేరున్న వ్యక్తి సోమిరెడ్డి అని, సర్పంచ్ గా మంచిగా పని చేశారన్నారు. కేసీఆర్ కిట్టు,  కల్యాణ లక్ష్మి , షాదీముభారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. తెల్లాపూర్ లో 40వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని..అవి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. వాటిని నిజమైన నిరుపేదలందరికీ పైసా ఖర్చు లేకుండా ఇస్తామన్నారు. అంతేకాదు తెల్లాపూర్ ను మోడల్ మున్సిపాలిటీగా మార్చుకుందామన్నారు.

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు అడ్రస్సే లేదన్నారు మంత్రి హరీష్ రావు. తెల్లాపూర్ లో కారు తప్ప ఇంకో పార్టీ ఉండొద్దన్నారు. కేసీఆర్ తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. గెలిచిన వారు వార్డుల్లోనే ఉండాలని.. హైదరాబాద్ కు వస్తామంటే కుదరదన్నారు. కౌన్సిల్ లో కూడా టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఒక కుటుంబంలా పని చేస్తామన్నారు. అంతేకాదు రెబల్ గా గెలిచే వారిని మళ్లీ TRS లోకి తీసుకోబోమన్నారు మంత్రి హరీష్ రావు.