ఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడు: మంత్రి హరీష్ రావు

ఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడు: మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా 6 నెలలకో ఆరుగురు ముఖ్యమంత్రిలు మాత్రం మారతారని మంత్రి హరీష్ రావు చురకలంటించారు. రెండు రోజుల(సెప్టెంబర్ 17) కిందట కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీములను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఆరు గంటలు మాత్రమే కరెంటు ఉంటుందని.. ఉదయం పూట మూడు గంటలు అర్ధరాత్రి మూడు గంటలు కరెంటు ఇస్తారని అన్నారు హరీష్ రావు. 

Also Read :- నిమజ్జన ఏర్పాట్లు మరింత పెంచాం.. అపోహలు నమ్మొద్దు: తలసాని

కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు రెండవ రాజధాని అవుతుందని.. ఏది కావాలన్నా ఢిల్లీ వయా బెంగళూరు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు కమెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని మంత్రి హరీష్ రావు సూచించారు.