మూడోసారి అధికారంలోకి రాగానే.. రేషన్ షాపుల్లో సోనామసూరి బియ్యం ఇస్తాం: హరీష్​ రావు

మూడోసారి అధికారంలోకి రాగానే.. రేషన్ షాపుల్లో సోనామసూరి బియ్యం ఇస్తాం: హరీష్​ రావు

మూడోసారి అధికారంలోకి రాగానే రేషన్ షాపుల్లో సోనామసూరి బియ్యం ఇస్తామని హరీష్​ రావు చెప్పారు. ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్.. ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. వంద అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్సీల అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్​రావు రోడ్ షో నిర్వహించారు. 

కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ హామీలను కాపీ కొట్టారని మంత్రి హరీష్​ రావు అన్నారు. ఆఖరుకు రామక్క సాంగ్ ను కూడా కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నమ్మితే మళ్లీ ఆగం అవుతారని.. ఆ పార్టీ గెలిస్తే రైతుబంధు రాదని చెప్పారు. సౌభాగ్య లక్ష్మీకింద మహిళలకు రూ. 2వేలు ఇస్తామని చెప్పారు.