ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి : మంత్రి హరీశ్‌రావు

 ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి : మంత్రి హరీశ్‌రావు

ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తనతో బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జైళ్లలో ఉన్న ఖైదీలకు మానసిక పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఖైదీలలో మార్పు, సత్ప్రవర్తన వచ్చి వారి కాళ్లమీద వారే బతికేలా దారి చూపెడుతున్నామన్నారు. ఖైదీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి శివారులో జిల్లా కారాగార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. రూ.78 కోట్లతో జిల్లా జైలు భవనాన్ని నిర్మించనున్నారు. 425 మంది ఖైదీలు ఉండేలా 34 ఎకరాల్లో ఆధునిక వసతులతో జైలు భవనాన్ని నిర్మిస్తామన్నారు.

జైళ్లల్లో సౌకర్యాలు కల్పించి, అవసరమైన ఉపాధి శిక్షణ, కౌన్సెలింగ్, అక్షరాస్యత నేర్పి, ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం ద్వారా దేశంలోనే రాష్ట్ర జైళ్ల శాఖ ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడ ఓపెన్ జైలు కూడా ఏర్పాటు చేస్తామని, ధ్యానం, యోగ, నైపుణ్య శిక్షణ, కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకే ఏర్పాట్లు చేస్తామన్నారు.