
సిద్దిపేట జిల్లా: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి ఆరా తీశారు. పనుల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆలయ ద్వారాలకు కల్యాణం లోపు వరకు వెండి తొడుగులు అమర్చాలని తెలిపారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం లోపు పనులు పూర్తికావాలన్నారు.
దాసరగుట్ట రోడ్డు నిర్మాణనికి రూ.5 కోట్ల మంజూరుకై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హరీష్ అధికారులను ఆదేశించారు. ఎల్లమ్మ గుడి వద్ద రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,జెడ్పిచైర్ పర్సన్ రోజాశర్మ, తదితరులు పాల్గొన్నారు.