మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చాం

మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చాం

అల్లా దయతో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గద్ద బొమ్మ వద్ద ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలయ్ బలయ్ తీసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రంలో హిందువులకు బతుకమ్మకు ముస్లింలకు రంజాన్ కు బట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు. పేద ముస్లిం ఆడపిల్లల కోసం శాదీముబారక్ పథకం తెచ్చామన్నారు. మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేపట్టామన్నారు.