ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు?

ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు?

వ్యవసాయ బిల్లులకు పూర్తి మెజారిటీ లేకపోయినా మూజువాణి ఓటుతో బిల్ పాస్ చేయించుకోవడం సక్రమమేనా అని ప్రధాని మోడీని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానమని హరీష్ అడిగారు. ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్థించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి అని హరీష్ అన్నారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకించినా వ్యవసాయ బిల్లులను తీసుకురావడం న్యాయమా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం వల్ల తెలంగాణ బిల్లు పాసయిందని.. ఆ బిల్లు ఆమోదం పొందడం అన్యాయమంటన్నారే.. ఇదెక్కడి న్యాయం అని హరీష్ అడిగారు.

For More News..

కేసీఆర్ వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు

పార్లమెంట్ గురించి తెలిసినవారు ఎవరూ అలా మాట్లాడరు

పుష్కర్ ధామి ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీ హై