
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టీఆర్ఎస్‌కు మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు. మంత్రి హరీష్.. మున్సిపల్ ఎన్నికల విజయానికి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో కింది విధంగా పోస్టు చేశారు.
‘ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRSకు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టీఆర్ఎస్‌కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు.
For Municipal Elections Results See Here