కాంగ్రెస్వి కల్లబొల్లి కబుర్లు : కాంగ్రెస్ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

కాంగ్రెస్వి కల్లబొల్లి కబుర్లు : కాంగ్రెస్ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట డిక్లరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న  రాష్ట్రాల్లో వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మాత్రం రూ. 4 వేలు ఇస్తామంటూ నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి రారని చెప్పారు.

బండి సంజయ్ కూడా GHMC  ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తాం అన్నారని, ఇప్పటికీ బండి లేదు.. ఏదీ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే హామీలు వాళ్ల సొంత రాష్ర్టాల్లో అమలు చేయడం చేతగాదు కానీ.. తెలంగాణలో మాత్రం కల్లబొల్లి మాటలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు  వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దివ్యాంగులకు  4 వేల16 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు అయితే పడని... ఆ తర్వాత హామీలు ఎగ్గొడుదాం అని ఆలోచిస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే ఎండమావులకు ఆశపడ్డట్టు అవుతుందన్నారు.