డబ్బులుంటే టైంకు జీతాలియ్యమా?: హరీశ్

డబ్బులుంటే టైంకు జీతాలియ్యమా?: హరీశ్

 

  • నిధులను కేంద్రం ఆపుతున్నది.. అందుకే ఇబ్బందులు: హరీశ్‌‌
  • ఫస్ట్‌‌కే జీతాలొచ్చేలా చూస్తం.. విద్యాశాఖ‌‌లో ఖాళీలన్నింటినీ భ‌‌ర్తీ చేస్తమని హామీ

హైదరాబాద్, ఎల్ బీ నగర్, వెలుగు: డబ్బులు లేకనే ఉద్యోగులకు టైమ్​కు జీతాలు ఇవ్వడం లేదని మంత్రి హరీశ్​రావు చెప్పారు. “గతంలో ప్రతి నెల 1న జీతం వస్తుండె. ఈ మధ్యన 5వ తేదీ, 10వ తేదీ అయితున్నదని  మీ మనసులో ఉండొచ్చు. డబ్బులుండి మేం జీతాలు ఇయ్యకుండా ఉంటమా? కావాలని ఆగుతదా? మొదటి ఆరేండ్లు, ఏడేండ్లు ఎప్పుడూ జీతాలు ఆగలే. ఈ ఏడాది, రెండేండ్ల నుంచే ఈ సమస్య ఎందుకు వస్తందో మీకు తెలవాలె’’ అని టీచర్లతో ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నదని, అందుకే సమస్య వస్తున్నదని తెలిపారు.  మొన్న బడ్జెట్‌‌లో తాము రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్‌‌ను పాస్ చేశామని, కానీ కేంద్రం ఏకపక్షంగా ఎఫ్ఆర్‌‌‌‌బీఎంలో రూ.15 వేల కోట్లకు కోత పెట్టిందని చెప్పారు. 

‘‘బోరు బాయిల దగ్గర మీటర్లు పెడతవా పెట్టవా అని కేంద్రం అంటే.. మేం పెట్టమన్నం. అందుకే గత ఏడాది, ఈ ఏడాది రూ.12 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి రాకుండా ఆపేసిండ్రు” అని మండిపడ్డారు. శనివారం మన్సూరాబాద్‌‌‌‌లోని ఓ గార్డెన్‌‌‌‌లో నిర్వహించిన స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) వజ్రోత్సవాల్లో మంత్రులు హరీశ్‌‌‌‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీచర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రమోష‌‌‌‌న్లు, బ‌‌‌‌దిలీల విష‌‌‌‌యంలో కేసీఆర్ పాజిటివ్‌‌‌‌గా ఉన్నారని చెప్పారు. విద్యాశాఖ‌‌‌‌లోని ఖాళీలన్నింటినీ త్వర‌‌‌‌లోనే భ‌‌‌‌ర్తీ చేస్తామని హరీశ్ చెప్పారు. కేంద్రం మోడ‌‌‌‌ల్ స్కూల్స్‌‌‌‌ను ర‌‌‌‌ద్దు చేసిందని, అయినా మ‌‌‌‌నం కొన‌‌‌‌సాగిస్తున్నామని తెలిపారు. అంగ‌‌‌‌న్‌‌‌‌వాడీల బ‌‌‌‌డ్జెట్‌‌‌‌లో కేంద్రం కోత విధించిందని చెప్పారు. విద్యా శాఖ‌‌‌‌కు తాము రూ. 25 వేల కోట్ల బ‌‌‌‌డ్జెట్ కేటాయించామని, కొంత మంది మాత్రం 5 శాతం మాత్రమే కేటాయించామని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కేంద్రం అడ్డుకుంటున్నది: నిరంజన్‌‌‌‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కేంద్రం అడ్డుకుంటున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గత 8 ఏండ్లలో సీఎం కరెంట్, నీటి సమస్యను పరిష్కరించారని చెప్పారు. స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. త్వరలో టీచర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. మనదేశంలో విద్యావ్యవస్థ కొంత గందరగోళంగా ఉందని, సమగ్ర విద్యావిధానం రూపొందించి అమలు చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని ఫైర్ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

టీచర్ల సమస్యలు పరిష్కరిస్తం: సబిత

చెట్టు కింద అయినా కూర్చోపెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వహించేది టీచర్లు ఒక్కరేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏ సమస్య ఉన్నా.. పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా ఒక్కతాటిపైకి వచ్చారని చెప్పారు. కరోనా సమయంలో డిజిటల్ క్లాసులకు వెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు. టీచర్ల సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని సబిత హామీ ఇచ్చారు.