కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం

కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం

కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో డోసు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేసి.. వైద్యసేవల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నారు. 15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్ సీల్లో  ఐసోలేషన్ కిట్లు, పరీక్ష కిట్లు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.  బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీగా పరిశీలించాలన్నారు.ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అప్పులపాలు కావొద్దని.. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందన్నారు.కరోనాపై పోరులో వివిధ శాఖలతో పాటు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్న హరీశ్ రావు.. వ్యాక్సినేషన్ పట్ల ప్రజలను చైతన్య పరచాలన్నారు. నాన్ కరోనా సేవలకు ఎలాంటి అంతరాయం కలగొద్దని సూచించారు.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్‌‌కు కలలో కూడా బండి సంజయ్ కనిపిస్తున్నారు