అందరూ కషాయం తాగండి

అందరూ కషాయం తాగండి

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరేకృష్ణ మూవ్ మెంట్, మెగా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. గతంలో పట్టణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు.. ఇప్పుడు వేడినీరు, కశాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా కష్ట కాలంలో ప్రజలెవరూ బయటకు రాకూడదు. అవసరమైతే స్వీయ నియంత్రణ పాటించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలి.యోగ, వ్యాయామం చేసే అలవాటున్న వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. అందరూ వ్యాయాన్ని అలవాటుగా చేసుకోవాలి. సిద్దిపేటలో మూడు వేడి నీటి కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. వేడి నీరు, కషాయం తాగితే సులువుగా కరోనా నుంచి బయట పడవచ్చు. అందుకే అందరూ వేడినీరు, కషాయం అలవాటు చేసుకోవాలి. కరోనా వచ్చి హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్ళకి ప్రభుత్వం తరపున 12 రకాల వస్తువులతో కరోనా కిట్ అందిస్తున్నాం. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకెళ్లి లక్షల రూపాయల ఖర్చు చేయోద్దు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు అందరూ తప్పకుండా పాటించాలి. సిద్దిపేటలో 100 పడకల కోవిడ్ హాస్పిటల్ ఉంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే అక్కడికెళ్లి పరీక్షలు చేయించుకోవాలి’ అని అన్నారు.

For More News..

వీడియో: సెల్పీ కోసం నదిలోకి దిగిన అమ్మాయిలు.. నీటి ప్రవాహం పెరగడంతో..

నాలుగేళ్లలో ఐదుగురు పిల్లలను చంపిన తండ్రి

దేశంలో 24 గంటల్లో 48,916 కరోనా కేసులు