తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో 2 వేల పెన్షన్ ఇవ్వటం లేదు

తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో 2 వేల పెన్షన్ ఇవ్వటం లేదు

కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని  మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ మండలం రామంచలో పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితాల బంద్ చేయాలని అంటుందన్నారు. ఉచితాలు వద్దని అనుచిత వాఖ్యలు చేసే బీజేపీ సర్కారును బంద్ పెట్టాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో 2 వేల పెన్షన్ ఇవ్వటం లేదని తెలిపారు.

కేంద్రం పెద్ద కంపెనీల రుణాలు మాఫీ చేస్తూ పేదల పథకాలను తప్పుబడుతోందని విమర్శించారు. - బీజేపీ వచ్చాక పెట్రోల్ డీజిల్, గ్యాస్ తో సహా అన్ని ధరలు పెరిగాయని, ధరలు పెంచోటోల్లు ఎవరు.? ఉచితంగా పేదలకు పంచేటోల్లు ఏవరో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. - బీజేపి ప్రభుత్వం ఆదాయం రెట్టంపు చేయలేదు కానీ ఖర్చు రెట్టింపు చేసిందని అన్నారు. అటు వచ్చే నెల నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని హరీశ్ స్పష్టం చేశారు.