
భారీ వర్షాలపై నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులకు వరద, లోతట్టు ప్రాంతాల జలమయం, ప్రజల పునారావాసంపై చర్చించారు. కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టులకు వరదతో ఎలాంటి ముప్పు లేదని మంత్రి తెలిపారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, పంట నష్టంపై ప్రాథమిక నివేదికలు తయాచేస్తున్నట్లు చెప్పారు. కడెం మండల పరిధిలోని 25 గ్రామాల ప్రజలతో పాటు జీఎన్ఆర్ కాలనీలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. తెగిన చెరువులు, కుంటలు, రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపడతామన్నారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. జిల్లాల్లో వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మంత్రి వెల్లడించారు.