ఎమ్మెల్యేగా జానారెడ్డి సాగర్ అభివృద్ధికి చేసింది ఏం లేదు

ఎమ్మెల్యేగా జానారెడ్డి సాగర్ అభివృద్ధికి చేసింది ఏం లేదు

నాగార్జున సాగర్ నియోజక వర్గానికి 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి జానా రెడ్డి చేసిందేమీ లేదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీస్కెళ్లడంలో ఆయన విఫలమయ్యారన్నారు.ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసినట్లే ఇక్కడ అన్ని పథకాలు అమలు చేసామన్నారు. మంచినీటి సమస్యను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు జగదీశ్ రెడ్డి.

TRS తోనే సమస్యల పరిష్కారమవుతాయని ప్రజలు నోములను గెలిపించారని తెలిపారు మంత్రి జగదీశ్. ఆయన లేని లోటును పూడ్చేందుకే కేసీఆర్ .. నోముల భగత్ కి అవకాశం ఇచ్చారని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాక చాలా రాష్ట్రాల్లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చిందన్నారు.అన్ని ఆచార సంస్కృతులను గౌరవించి ప్రోత్సహించింది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ముస్లిం యువతకు విద్యను అందించేందుకు కార్పొరేట్ స్థాయిలో గురుకులలను ఏర్పాటు చేసామని..ముస్లిం, మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడంతోపాటు, బడ్జెట్ కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. షాది ముబారక్ ఇవ్వాలని ఎవరు అడగలేదు.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రజలకు సహాయం చేయడంపై కేసీఆర్ దృష్టి ఉంటే, పేద ప్రజలను విభజించి పీడించే పాలన ఢిల్లీలో సాగుతోందని ఆరోపించారు మంత్రి జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ ల విధానాలతోనే దేశం అధోగతిపాలవుతోందన్నారు.