తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటోంది

తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటోంది

కేంద్రంపై విమర్శలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కరెంట్ కొనకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ కి బొగ్గు కొరత లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమావాస్య రోజు హెలికాఫ్టర్ లో వస్తే దేశంలో ఎక్కడ వెలుగులు కనిపిస్తాయో అదే తెలంగాణ రాష్ట్రమన్నారు.

దేశమంతా చీకట్లో ఉందని, తెలంగాణ మాత్రం వెలుగుల్లో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే విద్యుత్ చార్జీలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. రాజకీయ అవసరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం..

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం