చెల్లని చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

చెల్లని చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేసిన చెక్కులపై లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఇచ్చిన చెక్కుల్లో కొన్ని డేట్స్ అయిపోగా.... మరికొన్నింటికి ఒక్క రోజే గడువు ఉండడంతో అవి చెల్లవని చెప్పారు బ్యాంకు అధికారులు. నిన్న మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి పర్యటించారు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి. మొత్తం 355 మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చారు మంత్రి. 

ఐతే మార్చి నెలలో మంజూరైన కల్యాణలక్ష్మీ చెక్కులను...చాలా ఆలస్యంగా అంటే జూన్ లాస్ట్ వీక్ లో పంపిణీ చేశారు మంత్రి. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడంతోనే చెక్కుల పంపిణీని ఆలస్యం చేశారనే ఆరోపిస్తున్నారు స్థానికులు. తనను అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.