హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 24న రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కవయిత్రులతో కవితా సమ్మేళనం నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో సోమవారం (సెప్టెంబర్ 15) ఈ కార్యక్రమాన్ని సంబంధించిన పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపే కవితలను కవయిత్రులు వినిపించనున్నారు. ఆ తర్వాత కవయిత్రులు అందరూ కలిసి బతుకమ్మ ఆడనున్నారు.
