సెలబ్రిటీ ది స్కై పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్..పెట్టుబడులను ఆకర్షించి టూరిజం డెవ్ లప్ చేస్తాం

సెలబ్రిటీ ది స్కై పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్..పెట్టుబడులను ఆకర్షించి టూరిజం డెవ్ లప్ చేస్తాం

ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను  జనవరి 13 నుంచి 15 వరకు అంగరంగ వైభవంగా   నిర్వహిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. సెలబ్రిటీ ది స్కై పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పారు.  జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్  కైట్ అండ్  స్వీట్  ఫెస్టివల్, డ్రోన్ డే సందర్భంగా 13, 14వ తేదీల్లో డ్రోన్  ఫెస్టివల్, 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్  నిర్వహిస్తామని వివరించారు. తెలంగాణ కల్చర్ ను వెలికితీయడంలో భాగమే పతంగుల పండగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జూపల్లి.  పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ కు పలు దేశాల సభ్యులు వస్తారని చెప్పారు. కైట్ ఫెస్టివల్ కు 19 దేశాలకు చెందిన 40 మంది అతిథులు.. 15 రాష్ట్రాల నుంచి టూరిస్ట్ లు రానున్నారని చెప్పారు. అత్యంత బరువైనవి, అత్యంత ఎత్తుకు కైట్స్ ఎగిరేస్తామన్నారు.

టూరిజాన్ని డెవ్ లప్ చేయాలంటే ప్రైవేట్ పెట్టబుడులను ఆకర్షించాలన్నారు మంత్రి జూపల్లి.   పర్యాటక రంగంలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు.  పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రకృతి సంపదను ప్రజలకు దగ్గరగా చేస్తున్నామన్నారు. ప్రకృతి అందాలను  కొత్తగా సృష్టించలేమన్నారు. రాష్ట్రంలో గొప్పగొప్ప కట్టడాలను పర్యాటకులకు తెలియజేయాలన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు టూరిజంపై ఆధారపడ్డాయన్నారు. టూరిజం రంగంలో తెలంగాణ అడుగున ఉందన్నారు.  పెట్టుబడులను ఆకర్షించి పలు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు.   తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకే మిస్ వరల్డ్ పోటీలు పెట్టామని తెలిపారు జూపల్లి.   మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచాన్ని ఆకర్షించామన్నారు. 60 అడుగుల బతుకమ్మను పేర్చి గిన్నీస్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నామని తెలిపారు.