బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తామంటున్రు : జూపల్లి కృష్ణారావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తామంటున్రు  : జూపల్లి కృష్ణారావు

తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.  రూ.7 లక్షల కోట్ల అప్పుకు  రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందని చెప్పారు.  బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారన్నారు.  తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు.  తమ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని అంటున్నారని బీఆర్ఎస్ తమతో పోటీపడి మరి హామీలు ఇచ్చిందని మరి వాటిని ఎలా అమలు చేసేవారిని ప్రశ్నించారు.  

బీఆర్ఎస్ కు  ప్రజలు బుద్ధి చెప్పి 2 నెలలు కూడా కాలేదు.. అప్పుడే  కేటీఆర్, హరీష్ రావు లు పోటీపడి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి.  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు బయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ లోకి రావడానికి సిద్దంగా ఉన్నా..తాము వద్దనుకుంటున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానిని కలిస్తే తప్పేంటన్నారు జూపల్లి.  బీఆర్ఎస్, బీజేపీ మధ్యున్న మైత్రి ప్రజలందరికీ తెలుసునన్నారు.