కొల్లాపూర్, వెలుగు : ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఏడేండ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది. కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన పుట్టపోగ కృష్ణయ్య కుమారుడు రామచంద్రుడు ఏడేండ్ల కింద కృష్ణా నదిలో పడి మృతి చెందగా, అప్పట్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక సాయం అందలేదు.
ఈ విషయాన్ని గ్రామ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి అధికారులతో మాట్లాడి మరుగున పడిన దరఖాస్తును వెలికితీసి పరిష్కరించారు. దీని ఫలితంగా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 3 లక్షలు మంజూరు కాగా, గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు.
