- అధికారులతో జూపల్లి
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్రూప్- 1లో ఎంపికైన ఏఈఎస్‌లు, గ్రూప్- 2లో ఎంపికైన 84 మంది ఎస్సైలకు మంగళవారం ఎక్సైజ్ అకాడమీలో శిక్షణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ చట్టంపై పట్టు సాధించాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి యాక్సలరీ ప్రమోషన్లు ఇస్తామని వెల్లడించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు మాట్లాడుతూ చట్టం అమలులో నైపుణ్యంపై దృష్టి పెట్టాలన్నారు.
