ఆమ్దానీలో టూరిజానిది ముఖ్య పాత్ర.. పర్యాటకంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి: మంత్రి జూపల్లి

ఆమ్దానీలో టూరిజానిది ముఖ్య పాత్ర.. పర్యాటకంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి: మంత్రి జూపల్లి

ఓయూ, వెలుగు: రాష్ట్ర ఆదాయాన్ని పెంచ డంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని, అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సారించాలని ఆ శాఖ మంత్రి జూపల్లి 
కృష్ణారావు సూచించారు. ఉద్యోగాల కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. ‘గ్లోబల్ టూరిజం న్యూ ఎవెన్యూస్  ఫర్  సస్టైనబుల్  డిపార్ట్​మెంట్’ అనే అంశంపై గురువారం ఓయూలోని ఠాగూర్  ఆడిటోరియంలో మూడు రోజుల సెమినార్​ను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​తో కలిసి జూపల్లి  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మొదటి రోజు గ్లోబల్ టూరిజం, రెండో రోజు నేషనల్ టూరిజం, చివరి రోజు తెలంగా ణ టూరిజంపై ఈ సదస్సులో చర్చిస్తామన్నా రు. ఈ సదస్సు నుంచి వచ్చే సలహాలు, సూచనలను తీసుకొని టూరిజం డెవలప్​మెంట్  కోసం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సదస్సులో ఎన్ఐటీహెచ్ఎం డైరెక్టర్  వెంకటరమణ, ఐపీఈ డైరెక్టర్  శ్రీనివాసమూర్తి, కాన్ఫరెన్స్  డైరెక్టర్  చెన్నప్ప, కాన్ఫరెన్స్  చైర్మన్  ఎం.గంగాధర్, కాన్ఫరెన్స్  కన్వీనర్లు కృష్ణ చైతన్య, ఇంద్రకంటి శేఖర్, ప్యాట్రిక్, ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.