ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే పాదయాత్ర: కిషన్ రెడ్డి

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే పాదయాత్ర: కిషన్ రెడ్డి

నిధుల కొరతతో సిటీలోని బస్తీలను ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్ హనుమాన్ టెంపుల్ కమ్యూనిటీ హాల్ నుంచి  కిషన్ రెడ్డి  పాదయాత్రను నిర్వహించారు.  ముషీరాబాద్, అడిక్ మెట్, రాంనగర్, బాగ్ లింగంపల్లి డివిజన్స్ లోని బస్తీలలో పాదయాత్ర కొనసాగింది. బస్తీల్లో నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను పాదయాత్ర చేశానని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆసీఫ్ నగర్ డివిజన్ పరిధిలోని దాయిబాగ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్ లో నెలకొన్న సమస్యలపై అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

https://twitter.com/kishanreddybjp/status/1605564137970405377